Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఫోటో పెట్టాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తీర్మానం ప్రవేశపెట్టింది. పీపీపీ పార్టీ వ్యవస్థాపకుడైన భుట్టోని జాతీయ ప్రజాస్వామ్య హీరోగా ప్రకటించాలని, కరెన్సీ నోట్లపై అతని బొమ్మ పెట్టలాని ప్రభుత్వాన్ని కోరుతూ ఆదివారం తీర్మానాన్ని ఆమోదించారు. జుల్ఫికర్ అలీ భుట్టోపై చర్చిస్తూ ‘‘భుట్టో రిఫరెన్స్ అండ్ హిస్టరీ’’ అనే సెమినార్ సందర్భంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
పీపీపీ వ్యవస్థాపకుల్లో ఒకటిగా ఉన్న అహ్మద్ రెజా కసూరి హత్యకు ఆదేశించాడనే జుల్ఫికర్ అలీ భుట్టోపై అభియోగాలు నమోదయయ్యాయి. అయితే ఆ సమయంలో పాకిస్తాన్‌ని పాలిస్తున్న మహ్మద్ జియా ఉల్ హక్ కావాలనే అతడిని ఇందులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిని ఉరితీశారు. ఇటీవల పాక్ సుప్రీంకోర్టు అతడి ఉరిశిక్షను తప్పుపట్టింది. తాజా తీర్మానంలో భుట్టోకి ‘‘క్వాయిడ్ ఏ అవామ్’’ (ప్రజల నాయకుడు) బిరుదును ప్రదానం చేయాలని పాక్ ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది. దీంతో పాటు పాక్ అత్యున్నత పురస్కారం నిషన్-ఏ-పాకిస్తాన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Read Also: Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ కాల్పులు.. 10అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి
కరెన్సీ నోట్లపై భుట్టో చిత్రాన్ని ఉంచాలని డిమాండ్ చేయడంతో పాటు, భుట్టో గౌరవార్థం తగిన స్మారక చిహ్నాన్ని నిర్మించాలని, ఆయన సమాధిని జాతీయ మందిరంగా ప్రకటించాలని తీర్మానం కోరినట్లు స్థానిక మీడియా నివేదించింది. భుట్టోకు విధించిన అన్యాయమైన మరణశిక్షను రద్దు చేయాలని మరియు దాని కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమకారులకు ఇచ్చేందుకు ‘‘జుల్ఫికర్ అలీ భుట్టో అవార్డు’’ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, జాతీయ అసెంబ్లీ మార్చిలో జుల్ఫికర్ అలీ భుట్టో విచారణను న్యాయపరమైన హత్యగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. హ్యా నేరంలో భుట్టోకి ఏప్రిల్ 4, 1979న ఉరితీశారు.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?