Imran Khan urges Pak Army Chief to ensure transparent elections: పాకిస్తాన్‌లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని.. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ అసిమ్ మునీర్‌ను ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్మీ చీఫ్ పారదర్శకమైన సార్వత్రిక ఎన్నికలను నిర్ధారిస్తారని తాను ఆశిస్తున్నానని, మిలిటరీకి ఉన్న అధికారం మరే ఇతర సంస్థకు లేదని ఆయన అన్నారు. ఆర్మీ సానుకూల పాత్ర పోషిస్తే.. పాకిస్తాన్ పురోగమనాన్ని ఎవరూ ఆపలేరని కూడా పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ అన్నారు. ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది ఒక రియాలిటీ అని, ఇది చట్టానికి అతీతమని పేర్కొన్నారు. చట్టం పాలన కోసం ఆర్మీ పని చేయడం ప్రారంభిస్తే.. పరిస్థితి కచ్ఛితంగా మెరుగుపడుతుందని ఉద్ఘాటించారు.
Priyanka Gandhi : ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంకా గాంధీ భారీ కటౌట్లు
ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ ఇంజనీరింగ్ పట్ల తనకున్న భయాల గురించి ఇమ్రాన్ కాన్ మాట్లాడుతూ.. తనని, తన పార్టీని బలహీనపరిచేందుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లి లీగ్-నవాజ్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. తన సభ్యులనే తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి.. వాళ్ల పార్టీలో చేర్పించుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నాయని.. ఈ వ్యవహారాల్ని తమ పార్టీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. పొలిటికల్ ఇంజినీరింగ్ ఇంకా కొనసాగుతోంది కాబట్టే.. ముత్తాహిదా క్వామీ ఉద్యమం-పాకిస్థాన్ (MQM-P)లో వివిధ వర్గాలు విలీనం చేయబడ్డాయన్నారు. అలాగే.. తన పార్టీకి దూరంగా ఉంటోన్న నేతల్ని కలిసేందుకు ఇమ్రాన్ తిరస్కరించారు. సెంట్రల్ సెక్రటేరియట్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఇలాహి విశ్వాస తీర్మానానికి ఓటింగ్ సమయంలో హాజరుకానందుకు తమకు అందజేసిన షోకాజ్ నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆయన తన పార్టీ సభ్యుల్ని ఆదేశించారు.
Delhi Crime: దొంగతనానికి వెళ్లి.. శవమై తేలాడు
నేషనల్ రీకన్సిలియేషన్ ఆర్డినెన్స్ (NRO)కి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యల పట్ల కట్టుబడి ఉన్నానని.. ఈ విషయంపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ తెలిపారు. అలాగే.. యునైటెడ్ స్టేట్స్‌లో మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీపై తాను చేసిన ఆరోపణలకు సైతం కట్టుబడి ఉన్నానన్నారు. ఈ నెల ప్రారంభంలో.. జనరల్ (రిటైర్డ్) కమర్ జావేద్ బజ్వా 2021 వేసవిలో పీటీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుఎస్‌లో లాబీయింగ్ చేయడానికి హక్కానీ నియమించారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
Ambati Rambabu vs Nagababu: అవును నేను సంబరాల రాంబాబునే.. అంబటి కౌంటర్