పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హత్యకు గురయ్యారంటూ గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఆయన క్షేమంగా ఉన్నారంటూ ప్రభుత్వం చెబుతోంది. అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని చూపించలేదు. దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. క్షేమంగా ఉంటే ఎందుకు చూపించడం లేదని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh-IAS Trainees: ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!
2023, ఆగస్టు నుంచి ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. అయితే నెల రోజుల నుంచి ఇమ్రాన్‌ఖాన్ చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురయ్యారంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి.
ఇది కూడా చదవండి: Breakfast Is Good Health: మార్నింగ్ టిఫిన్ చేయడం మానేశారా.. అయితే బీకేర్ ఫుల్..
తాజాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మెగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు చేయడాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించారు. డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హసన్ వకార్ చీమా ఉత్తర్వు ప్రకారం.. సెక్షన్ 144 డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. అయితే పోలీసుల తీరును తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తప్పుపట్టింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఎందుకు కలవనివ్వడం లేదని నిలదీస్తున్నారు.