Imran Khan: చీకటి గదిలో జీవించడానికైనా సిద్ధం.. కానీ, బానిసత్వం వద్దు
- పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తుంది..
- ఈ బానిసత్వాన్ని అంగీకరించను.. జైల్లోని చీకటి గదిలో జీవిస్తాను..
- నా సందేశం ప్రజలకు చేరకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంటుంది: ఇమ్రాన్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా షరీఫ్ సర్కార్ అన్ని విధాలా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని తన మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Sigachi Company: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
ఇక, ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఓటు హక్కు, చట్టబద్ధమైన పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా అని చెప్పుకొచ్చారు. ఇటీవల చేసిన 26వ రాజ్యాంగ సవరణ వీటన్నింటినీ నాశనం చేసేలా ఉందన్నారు. జూలై 6వ తేదీ తర్వాత.. ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని దేశం మొత్తానికి తెలిసేలా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పైనా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నియంత అధికారంలోకి వస్తే.. అతడికి ఓట్లు అవసరం లేదన్నారు. ట్రయల్-అండ్-ఎర్రర్ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని మండిపడ్డారు.
Read Also: Icon: అదే కథ.. మరో స్టార్ హీరో!
అలాగే, పాకిస్తాన్ కోర్టుల్లో ఎంపిక చేసిన న్యాయమూర్తులే ఉంటున్నారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగా మారిపోతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో వాక్ స్వాతంత్ర్యం పూర్తిగా కనుమరుగవుతోందన్నారు. నిజాయతీ గల జర్నలిస్టులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక, ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉంటున్నారు. బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పలు న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురు అవుతోంది.
“جعلی پارلیمنٹ کے ذریعے چھبیسویں کے بعد ستائیسویں ترمیم لانے کا تکلف کرنے کی بجائے کھل کر “بادشاہت” ڈکلئیر کر دینی چاہییے، کیونکہ ملک پر اس وقت مکمل طور پر ڈکٹیٹرشپ مسلط ہے-
پاکستان کی بنیاد “لا الہ الا اللہ” ہے- یہ کلمہ انسان کو ہر قسم کی غلامی سے آزادی دیتا ہے- پاکستان کو…
— Imran Khan (@ImranKhanPTI) July 1, 2025
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!