అల్లు అర్జున్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, తర్వాతి పరిణామాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. చాలా గ్యాప్ తీసుకుని, వేణు శ్రీరామ్ తమ్ముడు అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ లోపు, అల్లు అర్జున్ పుష్ప వన్, పుష్ప టూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఐకాన్ సినిమాను అల్లు అర్జున్‌తో చేయడం కష్టమేనని, దీంతో దిల్ రాజు సినిమా చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సినిమాకు కచ్చితంగా ఒక స్టార్ హీరో కావాలని వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
Also Read:Shirish Reddy: నేను మూర్ఖుడిని కాదు .. రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాం!
ఇది 100% యూనివర్సల్ సబ్జెక్ట్ అని, ఈ సినిమాకు స్టార్ కచ్చితంగా కావాలని ఆయన అన్నారు. ఈ సినిమాలో చెప్పే విషయం అలాంటిదని ఆయన తెలిపారు. మెసేజ్ ఇచ్చే సినిమా అయినా, మరీ క్లాసులు పీకే సినిమా కాదని, ఇది ఒక త్రిల్లింగ్‌గా ఉండే సినిమా అని వివరించారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సినిమాలోని విషయాన్ని కన్వే చేయాలంటే, స్టార్ ఉన్నప్పుడు అది అందరికీ ఎక్కువ రీచ్ అవుతుందని ఆయన అన్నారు. అలాగే, స్టార్ ఉన్నప్పుడే తనకు బడ్జెట్ వస్తుంది కాబట్టి, అనుకున్నది అనుకున్నట్లు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ సినిమాకు స్టార్ కావాలని ఆయన చెప్పారు.
Also Read:Dil Raju: దిల్ రాజు, ఇండస్ట్రీకి దూరం పెరిగిందా?
అయితే, ఐకాన్ అనే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయారని, ఇప్పుడు సినిమా చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలేమో అంటూ వేణు శ్రీరామ్ సరదాగా కామెంట్ చేశారు.