UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- యూపీ సీఎం పదవిపై కేశవ్ మౌర్య కీలక వ్యాఖ్యలు
- 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు
- తనకు సీఎం కావాలని ఆశ ఉందన్న డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార బీజేపీ-సమాజ్‌వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2017 కంటే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కుటుంబంలో ఎవరికీ 2047 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.
“అఖిలేష్ యాదవ్ కుటుంబంలో ఎవ్వరూ కనీసం 2047 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేరు. ఈసారి యూపీలో బీజేపీ చారిత్రక హ్యాట్రిక్‌ను ఎవరూ అడ్డుకోలేరు” అని మౌర్య వ్యాఖ్యానించారు. బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో బీజేపీ విజయాలను కూడా ప్రస్తావించారు. సమాజ్‌వాదీ పార్టీకి నేరచరిత్ర ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కేశవ్ మౌర్య ఆరోపించారు. బీజేపీ నేరపూరిత శక్తులకు వ్యతిరేకమని, కానీ ఎస్పీకి అలాంటి వ్యక్తులు మద్దతుదారులుగా, కార్యకర్తలుగా ఉన్నారని అన్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష కూటమి మెరుగైన ఫలితాలు సాధించడానికి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం కారణమైందని మౌర్య ఆరోపించారు. “2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో చాలా మార్పులు జరిగాయి. రిజర్వేషన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా ఎస్పీ-కాంగ్రెస్ 2024లో మంచి ఫలితాలు సాధించాయి” అని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాలు గెలుచుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి.
‘నాకు సీఎం కావాలనే ఆశ ఉంది’
ఇదే సమయంలో తనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఉందని కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. అయితే దీనివల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో తనకు విభేదాలు ఉన్నాయని మాత్రం ఖండించారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!