Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది
- భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు విషం
- ఇల్హాన్ ఒమర్ వ్యాఖ్యల్ని ఇప్పటికే ఖండించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, డెమోక్రటిక్ పార్టీ నేత ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. భారత్ ప్రస్తుతం ‘‘జెనోసైడ్ (జాతి నిర్మూలన) 8వ దశలో ఉంది.’’ అని ఆరోపించారు. జూన్ 7న జరిగిన ప్రసంగానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమాలియా మూలాలు ఉన్న ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. మొదటి నుంచి పాకిస్థాన్‌కు మద్దతుగా.. భారత్‌పై విషం కక్కుతూ ఉంటుంది. తాజాగా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read
- Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
- G7 Summit: ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
- Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
అమెరికాలో వలసదారులు, ముస్లింలపై పెరుగుతున్న వివక్ష నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో ఒమర్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇది కేవలం మోడీ ప్రభుత్వ చర్యల వల్ల మాత్రమే కాదు.. సమాజంలో కూడా వ్యవస్థాగతంగా మారుతోంది.’’ అని వ్యాఖ్యానించారు.
ఇల్హాన్ ఒమర్ ప్రస్తావించిన ‘‘జెనోసైడ్ 10 దశలు’’ అనే సిద్ధాంతాన్ని అమెరికన్ న్యాయవేత్త గ్రెగరీ స్టాంటన్ రూపొందించారు. ఇందులో 8వ దశను ‘పర్సిక్యూషన్’ (వేధింపులు, హింస)గా పేర్కొంటారు. ఈ దశలో ఒక నిర్దిష్ట వర్గంపై ప్రభుత్వ మద్దతుతో హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు స్థానచలనం, ఆస్తుల స్వాధీనం, వివక్ష వంటి చర్యలు జరుగుతాయని స్టాంటన్ వివరిస్తారు.
ఇల్హాన్ ఒమర్ వ్యాఖ్యలను భారత అనుకూల వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మైనారిటీల పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ప్రపంచంలోనే మైనారిటీలకు అత్యంత సురక్షితమైన, సమగ్రత కలిగిన దేశాల్లో ఒకటి. పొరుగు దేశాల్లో మైనారిటీలు వేధింపులకు గురై భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.’’ అని రిజిజు పేర్కొన్నారు.
భారత్‌లో స్వాతంత్ర్యం సమయంలో మైనారిటీల జనాభా సుమారు 11 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 20 శాతానికి పైగా పెరిగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఇటీవల పేర్కొన్నారు. మైనారిటీల జనాభా నిరంతరం పెరుగుతున్న దేశం భారత్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
సోమాలియా మూలాలు కలిగిన ఇల్హాన్ ఒమర్ గతంలో కూడా భారత్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్థాన్‌కు అనుకూల వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు కూడా ఆమెపై ఉన్నాయి. ఆమె పాల్గొన్న కార్యక్రమంలో అమెరికాలోని మిన్నెసోటా అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్, మిన్నెసోటా సెనేట్ మెజారిటీ లీడర్ ఎరిన్ మర్ఫీ, రిపబ్లికన్ సెనేటర్ జిమ్ అబెల్లర్ తదితరులు కూడా పాల్గొన్నారు. భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఇల్హాన్ ఒమర్ చేసిన ‘జెనోసైడ్ 8వ దశ’ వ్యాఖ్యలు మరోసారి భారత్-అమెరికా రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
- Tags
- IAMC event
- Ilhan Omar
- india
తాజావార్తలు
-
Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
-
Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
-
Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
-
Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!