Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
- 600 డాలర్ల అప్పు..
- ఎనిమిది అక్షరాల పేరు
- రూ. 23,000 కోట్ల భారీ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pizza Hut Success Story: చేతిలో కేవలం 600 డాలర్ల (సుమారు రూ. 50 వేలు) అప్పు.. ఒక చిన్న రేకుల షెడ్డు లాంటి హోటల్.. కానీ నేడు దాని విలువ అక్షరాలా 23,000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పిజ్జా రుచిని పరిచయం చేసిన ‘పిజ్జా హట్’ సక్సెస్ స్టోరీ ఇది. అయితే ఇన్నేళ్లుగా ప్రపంచాన్ని ఏలిన ఈ పిజ్జా దిగ్గజం, మారుతున్న డిజిటల్ మార్కెట్ సవాళ్ల మధ్య ఒక చారిత్రాత్మక విభజనకు సిద్ధమైంది. ఈ గ్లోబల్ ఎంపైర్ పుట్టుక నుంచి నేటి రూ.23వేల కోట్ల భారీ బిజినెస్ డీల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
600 డాలర్ల అప్పు.. ఎనిమిది అక్షరాల పేరు!
ప్రపంచవ్యాప్తంగా పిజ్జా ప్రియుల మనసు దోచుకున్న ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘పిజ్జా హట్’ (Pizza Hut) చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మారుతున్న మార్కెట్ సమీకరణాల నేపథ్యంలో, మాతృ సంస్థ ‘యమ్ బ్రాండ్స్’ (Yum! Brands) ఈ పిజ్జా సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 2.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు) భారీ డీల్‌తో ఈ విభజన ప్రక్రియ పూర్తి కానుంది. ఈ అంతర్జాతీయ బ్రాండ్ ప్రస్థానం చాలా సాధారణంగా ప్రారంభమైంది. 1958లో అమెరికాలోని కాన్సాస్కు చెందిన ఫ్రాంక్, డాన్ కార్నీ అనే ఇద్దరు సోదరులు తమ తల్లి వద్ద 600 డాలర్లు అప్పుగా తీసుకుని ఒక చిన్న పిజ్జా రెస్టారెంట్‌ను తెరిచారు. షాప్ బయట ఉన్న సైన్‌బోర్డుపై కేవలం ఎనిమిది అక్షరాలకే స్థలం ఉండటంతో, వారు వారి రెస్టారెంట్‌కు “పిజ్జా హట్” అని పేరు పెట్టారు. ఈ రెస్టారెంట్ స్టార్టింగ్‌లో విద్యార్థులకు ఫ్రీగా పిజ్జా ముక్కలు ఇస్తూ కస్టమర్లను ఆకర్షించిన ఈ సోదరుల ఐడియా సూపర్ హిట్ అయింది. తర్వత కాలంలో ఫ్రాంచైజీ మోడల్‌తో దూసుకుపోతూ 1971 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా చైన్‌గా అవతరించింది. ఆ తర్వాత 1977లో పెప్సికో ఈ సంస్థను కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఇది కేఎఫ్‌సీ, టాకో బెల్ వంటి బ్రాండ్స్ ఉన్న ‘యమ్ బ్రాండ్స్’ పరిధిలో నడుస్తోంది.
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
డొమినోస్ దెబ్బ..
ఒకప్పుడు ఫ్యామిలీ డైనింగ్, బఫే లంచ్‌లు, ఎర్రటి పైకప్పుల (Red Roof) రెస్టారెంట్లతో ప్రపంచవ్యాప్తంగా 20,000 అవుట్లెట్లకు విస్తరించిన పిజ్జా హట్‌కు కాలక్రమేణా గట్టి పోటీ ఎదురైంది. 1980ల్లో ‘డొమినోస్’ తీసుకొచ్చిన హోమ్ డెలివరీ వ్యూహం, ఆ తర్వాతి కాలంలో స్మార్ట్ఫోన్లు, ఫుడ్ డెలివరీ యాప్‌ల విప్లవం పిజ్జా హట్ సాంప్రదాయ డైన్-ఇన్ (రెస్టారెంట్ కూర్చుని తినే) పద్ధతిని దెబ్బతీశాయి. ద్రవ్యోల్బణం, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు కంపెనీకి మరిన్ని సవాళ్లు విసిరాయి.
రూ. 23,000 కోట్ల భారీ డీల్..
ప్రస్తుత మార్కెట్ సవాళ్లను తట్టుకునేందుకు యమ్ బ్రాండ్స్ పిజ్జా హట్ వ్యాపారాన్ని రెండుగా ముక్కలు చేసింది. ఇందులో ఒకటి అంతర్జాతీయ మార్కెట్ (చైనా మినహా). దీనిని ‘లాంగ్రేంజ్ క్యాపిటల్’ సంస్థకు 1.5 బిలియన్ డాలర్లకు విక్రయించారు. ఇదే సమయంలో చైనా మార్కెట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ చైనాలో మాత్రం పిజ్జా హట్ అద్భుతమైన లాభాలతో దూసుకుపోతోంది. అందుకే అక్కడి కార్యకలాపాలను ‘యమ్ చైనా హోల్డింగ్స్’ సంస్థ 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఎంతటి అంతర్జాతీయ దిగ్గజమైనా సరే.. కాలంతో పాటు, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ బిజినెస్ మోడల్‌ను మార్చుకోకపోతే మనుగడ కష్టమని పిజ్జా హట్ తాజా ఒప్పందం నిరూపిస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?