Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో భేటీ అయ్యారు.
భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ కు వంత పాడుతూ.. తమ మనస్సు నిండా భారత వ్యతిరేఖతను నింపుకుంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన డెమెక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ మరోసారి తన భారత వ్యతిరేఖతను బయటపెట్టారు. మతస్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారనే నెపంతో భారత్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. గత మూడేళ్లుగా డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ సభ్యులు రషీదా తాలిబ్, జువాన్ వర్గాస్, ఇల్హన్ ఒమర్ లు…