Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guinness World Records Village: ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం, రాలిపోవడం సాధారణ సమస్యగా మారింది. 25 నుంచి 30 ఏళ్ల మధ్యే చాలా మంది తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రపంచంలో ఒక గ్రామం ఉంది. అక్కడ 80 ఏళ్ల మహిళలకు కూడా నల్లటి, ఒత్తైన, పొడవాటి జుట్టు ఉంటుంది. ఈ విశేషం కారణంగానే చైనాలోని హువాంగ్లువో యావో గ్రామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైరుతి చైనాలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రపంచం ‘రాపుంజెల్ విలేజ్’గా పిలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా ఈ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడి మహిళల జుట్టు మోకాళ్ల వరకు, కొన్నిసార్లు 7 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
‘రాపుంజెల్’ అనే యూరోపియన్ జానపద కథలోని యువరాణి తన అత్యంత పొడవాటి జుట్టుతో ప్రసిద్ధి చెందింది. అదే తరహాలో ఈ గ్రామ మహిళలకు కూడా అసాధారణంగా పొడవైన జుట్టు ఉండటంతో ఈ ప్రాంతానికి ‘రాపుంజెల్ విలేజ్’ అనే పేరు వచ్చింది. హువాంగ్లువో యావో గ్రామం 2002లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. “అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళల అతిపెద్ద సమూహం” ఉన్న గ్రామంగా ఇది ప్రపంచ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
శతాబ్దాలుగా ప్రత్యేకమైన కేశ సంరక్షణ చర్యలు..
ఈ గ్రామంలో నివసించే యావో తెగ మహిళలు శతాబ్దాలుగా ప్రత్యేకమైన కేశ సంరక్షణ సంప్రదాయాలను పాటిస్తున్నారు. స్థానికుల ప్రకారం, చాలా మంది మహిళలకు 80 ఏళ్ల వయసు వచ్చినా తెల్ల వెంట్రుకలు కనిపించవు. పొడవాటి, నల్లటి, ఆరోగ్యవంతమైన జుట్టును వారు తమ సాంస్కృతిక గుర్తింపుగా భావిస్తారు. ఈ గ్రామంలో మరో ప్రత్యేక సంప్రదాయం కూడా ఉంది. ఇక్కడి మహిళలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జుట్టు కత్తిరించుకుంటారు. సాధారణంగా 18 ఏళ్ల వయసులో ఈ ఆచారం నిర్వహిస్తారు. అది ఆ యువతి వివాహానికి సిద్ధమైందనే సంకేతంగా భావిస్తారు. కత్తిరించిన జుట్టును భద్రపరిచి, వివాహం తర్వాత ప్రత్యేకంగా ఉపయోగించే సంప్రదాయం కూడా ఉంది.
వైవాహిక పరిస్థితిని తెలియజేసే జుట్టు..
యావో సమాజంలో మహిళల కేశాలంకరణ వారి వైవాహిక స్థితిని తెలియజేస్తుంది. తల చుట్టూ ప్రత్యేకంగా చుట్టిన జుట్టు ఉంటే ఆమె వివాహిత అని, మధ్యలో ముడి ఉంటే ఆమెకు పిల్లలు ఉన్నారని భావిస్తారు. జుట్టును పూర్తిగా గుడ్డతో కప్పుకుంటే ఆమె ఇంకా పెళ్లి కాలేదని గుర్తిస్తారు.
పొడవాటి జుట్టు వెనుక ప్రధాన రహస్యం..
ఇక్కడి మహిళల పొడవాటి జుట్టు వెనుక ఉన్న ప్రధాన రహస్యం పులియబెట్టిన బియ్యం నీటిగా చెబుతారు. బియ్యం కడిగిన నీటిని ఒక రోజు పాటు పులియబెట్టి, దానితో తలస్నానం చేస్తారు. బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలంగా, మెరిసేలా ఉంచడంలో సహాయపడతాయని స్థానికులు నమ్ముతారు. అయితే జుట్టు ఆరోగ్యం విషయంలో జన్యువులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం బియ్యం నీరు మాత్రమే ఈ ఫలితాలకు కారణమని శాస్త్రీయంగా నిరూపించబడలేదని వారు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ గ్రామానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా నల్లటి, ఒత్తైన జుట్టుతో కనిపించే మహిళలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి, సహజ జీవనశైలి కలయికతో హువాంగ్లువో యావో గ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!