పాకిస్తాన్ లో చాలా మంది అమ్మాయిలకు మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తుంటారు. కొంతమంది తమ కూతుళ్లను ఎక్కువ డబ్బులిచ్చిన వారికి కట్టబెడుతుంటారు. అయితే ఇలాంటి సంఘటనే పాకిస్తాన్ లో జరిగింది. డబ్బు కోసం తన కూతురును వేరే వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. మైనర్ అయిన కూతరు పెళ్లికి అడ్డు చెప్పడంతో దారుణంగా భార్యనే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
పాకిస్తాన్ లక్కీ షా సద్దార్ ప్రాంతానికి చెందిన జుల్ఫికర్ జిస్కానీ డబ్బుల కోసం తన మైనర్ కూతరును భారీ ధరకు వివాహం చేయాలని నిర్ణయించాడు. తన కూతురు హమేరాను రూ. 1,00,000 అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే జుల్ఫీకర్ నిర్ణయానికి భార్య బబ్లీ జిస్కాని అభ్యంతర తెలపిింది. దీంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. గతంలో కూడా తన ఇద్దర కూతుళ్లను జుల్ఫికర్ ఇలాగే భారీ ధర చెల్లించవారికి ఇచ్చి వివాహం చేశాడు. తన సోదరిని చంపాడని బబ్లీ జిస్కానీ సోదరుడు మునవ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న ఛచార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పాకిస్తాన్ లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటంతో పాటు ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం ప్రభావం వల్ల కొంత మంది తమ పిల్లలను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేదు. మరికొన్ని రోజుల్లో శ్రీలంక పరిస్థితి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డిజిల్ రేట్లను 30 శాతం పెంచింది. ఐఎంఎఫ్ ముంగిట సాగిలపడింది పాకిస్తాన్. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తేనే పాక్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ నుంచి సాయం రావాలంటే ముందుగా సబ్సిడీలను ఎత్తివేయాలి. ఇప్పటికే దేశంలో పెట్రోల్ రేట్లపై సబ్సిడీ తగ్గించి రేట్లు పెంచే సరికి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.