Lottery: ఈ జంట తెలివికి సలామ్ కొట్టాల్సిందే.. “గణిత విద్య”తో రూ.200 కోట్ల లాటరీని గెలిచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lottery: అమెరికాలో ఓ వృద్ధ జంట అసలైన జీనియస్‌లని చెప్పొచ్చు. ఏకంగా 26 మిలియన్ డాలర్లు( రూ. 200 కోట్లు)లను లాటరీల్లో సంపాదించింది. ఇతంతా వారి అదృష్టం అంటే మీరు పప్పులో కాలేసిటనట్లే, వీరికి ఉన్న అపారమైన గణిత విద్యను, మ్యాథ్స్ ట్రిక్స్ ఉపయోగించి ఈ లాటరీలను సొంతం చేసుకున్నారు. మిషిగాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలోని జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వీరు రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ప్రస్తుతం 80, 81 ఏళ్లు. వీరి జీవిత కథ ఆధారంగా ‘జెర్రీ & మార్జ్ గో లార్జ్.’ అనే సినిమా కూడా వస్తోంది.
ఈ క్రమంలో ఓ రోజు 2003లో సెల్బీ విన్‌ఫాల్ అనే లాటరీ గేమ్‌ని చూశారు. అయితే దీన్ని చూడగానే దీంట్లో ఒక మ్యాథమెటికల్ లూప్‌హోల్ ఉన్నట్లు గమనించాడు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఇందులో డబ్బు సంపాదించవచ్చని అతను కనుగొన్నారు. ఈ జాక్ పాట్ సొమ్ము 5 మిలియన్లకు చేరుకోని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుందని గమనించారు. ఈ లెక్క ప్రకారం 1,100 డాలర్లు వెచ్చించి, కొన్ని సంఖ్యలు ఉన్న 1,100 టికెట్లను కొనుగోలు చేస్తే కనీసం 1900 డాలర్లు పొందవచ్చని గ్రహించారు.
Also Read
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
Read Also: Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
ఆ తర్వాత తొలుత 3600 డాలర్ల పెట్టి టికెట్లను కొనుగోలు చేస్తే వీరు 6300 డాలర్లను సంపాదించారు. ఆ తర్వాత 8000 డాలర్లతో టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సారి లాభం రెట్టింపైంది. దీంతో వీరిద్దరు కలిసి జీఎస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి స్నేహితులు, బంధువులను ఇందులో చేర్చుకున్నారు. మసాచుసెట్స్‌లో విన్‌ఫాల్ వంటి లాటరీ కొనుగోలు చేస్తే, అక్కడికి వెళ్లి మొత్తం లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు.
గత 9 ఏళ్లలో ఈ టీం మొత్తం 26 మిలియన్ డాలర్లను సంపాదించారు. ఇందులో 8 మిలియన్ డాలర్లను పన్నుల రూపంలో కట్టారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో వీరి ఆరుగురు పిల్లలకు, వారి 14 మంది మనవలు-మనవరాళ్లను, 10 మంది ముని మనవలను చదివించారు. అయితే వీరిపై విచారణ జరిగినా.. పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే కొనుగోలు చేయడంతో వీరిని అక్కడి అధికారులు ఏం చేయలేదు. కేవలం రెండు నిమిషాల్లోనే ఈ ఆటలోని లొసుగులను గమనించి, పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లు వీరు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్‌లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!