Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళా ఎంపీ స్పీచ్..
- సైలెంట్ అయిపోయిన పురుష ఎంపీలు
- జర్మనీ పార్లమెంట్లో హాట్ టాపిక్‌గా మారిన మహిళా ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cathy Gebe : జర్మనీ పార్లమెంట్ (బుండెస్టాగ్) లో మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న హింసపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వామపక్ష పార్టీ ‘డై లింకే’కి చెందిన 29 ఏళ్ల యువ మహిళా ఎంపీ కేథీ గేబెల్ (Cathy Gebe) వేదికపై ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ (AfD) పార్టీకి చెందిన పురుష ఎంపీ మార్టిన్ రైఖార్ట్ ఒక వివాదాస్పద వ్యాఖ్యతో ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆ ఒక్క మాటతో పార్లమెంట్ షాక్ అయ్యింది..
మార్టిన్ రైఖార్ట్ చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం తడుముకోకుండా కేథీ గేబెల్ ఇచ్చిన కౌంటర్ దెబ్బకు సభ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమె మార్టిన్ వైపు చూస్తూ.. “స్త్రీ జననేంద్రియ భాగాన వేల సంఖ్యలో నరాల చివరలు ఉంటాయి.. కానీ మీరు అంతకంటే ఎక్కువ సున్నితంగా ఉన్నట్లున్నారు” అంటూ తీవ్రమైన వ్యంగ్యాస్త్రాన్ని ఆయనపై సంధించారు. ఆమె ఆ మాట అనగానే పార్లమెంట్లో ఉన్న పలువురు ఎంపీలు ఒక్కసారిగా నవ్వేశారు. అప్పటివరకు నోరు పారేసుకున్న ఎంపీ మార్టిన్ కొన్ని నిమిషాల పాటు తీవ్ర అసహనానికి, ఇబ్బందికి గురై మౌనంగా ఉండిపోయారు. అనంతరం గేబెల్ తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
నెట్టింట వైరల్ అయిన వీడియో..
నిజానికి ఈ ఘటన కొద్ది నెలల క్రితం మార్చిలో జరిగినప్పటికీ.. ఇటీవల కేథీ గేబెల్ ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మళ్లీ షేర్ చేయడంతో ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. గేబెల్ సమయస్ఫూర్తిని, జవాబుదనాన్ని వేలాది మంది నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. పార్లమెంట్ వంటి గౌరవప్రదమైన సభలో ఇలాంటి పదజాలం వాడటం సమంజసమేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కేథీ గేబెల్ మరో వీడియోను విడుదల చేస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తను ప్రసంగంలో చెప్పిన సైంటిఫిక్ ఫ్యాక్ట్‌లో ఒక చిన్న తప్పు దొర్లిందని.. మెడికల్ రీసెర్చ్ ప్రకారం క్లిటోరిస్‌లో నరాల చివరల సంఖ్య 10 వేలకు పైగా ఉంటుందని, తను పొరపాటున వేరే అంకె చెప్పానని స్పష్టం చేస్తూ దానికి సంబంధించిన సైంటిఫిక్ లింకులను షేర్ చేశారు. అయితే, మహిళల హక్కుల విషయంలో రాజీపడేది లేదని, ఎవరైనా తప్పుడు ప్రతిపాదనలు చేస్తే విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆమె తేల్చి చెప్పారు.
స్థానిక మహిళల గొంతుకగా కేథీ గేబెల్..
సైకాలజీ చదివిన కేథీ గేబెల్ జర్మనీలో మహిళా హక్కుల కోసం పోరాడే బలమైన గొంతుకగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన పార్టీ తరపున మహిళా విధానాల ప్రతినిధిగా వ్యవహరిస్తూ.. లింగ సమానత్వం, మహిళల రక్షణ, లైంగిక హింస వంటి అంశాలపై ఆమె నిరంతరం గళం విప్పుతున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులనే తప్పుబట్టే మనస్తత్వంపై గతంలో ఆమె పార్లమెంట్లో మాట్లాడిన వీడియోలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టించాయి.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!