టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”. తెలుగులో మొదటిసారి ఓ సూపర్ హీరో కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి.. ఈ సమావేశానికి అతిథిగా వచ్చారు.బాలీవుడ్‍లో కూడా రానా ఎంతో పాపులర్. బహుబలి సినిమానే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆయన నటించారు. బాలీవుడ్ వర్గాల్లో రానాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ తరుణం లో హిందీలో హనుమాన్‍ను ప్రమోట్ చేసేందుకు రానాను హనుమాన్ టీమ్ ఆహ్వానించింది. దీంతో ముంబై లో జరిగిన మీడియా సమావేశానికి రానా వచ్చారు.
హనుమాన్ హీరో, దర్శకుడిని ఆయన హిందీ మీడియాకు పరిచయం చేశారు.ఇంద్ర సినిమాలో బాల నటుడిగా చేసినప్పుడే తనతో పాటు తెలుగు వారందరూ తేజ సజ్జాకు అభిమానులమయ్యామని రానా అన్నారు. “మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఇంద్ర సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ సజ్జా చేశాడు. ఆ రోజు నుంచి నేను మాత్రమే కాదు తెలుగు మాట్లాడే ప్రతీ ఒక్కరూ ఇతడి అభిమానులయ్యారు. రెండున్నరేళ్ల వయసు నుంచి ఇతడు నటిస్తున్నాడు. ఈ విషయం లో నా కన్నా సీనియరే” అని రానా అన్నారు. తాను పదేళ్ల క్రితం ముంబైకు వచ్చానని, కానీ ఇక్కడి వారు తనను ప్రేమించారని రానా తెలిపారు.మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండే హనుమాన్ మూవీను ఈ టీమ్ రూపొందించారు. ఈ చిత్రం గురించి ఆన్‍లైన్‍తో పాటు అన్ని చోట్ల ఉత్సాహం ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం” అని రానా బాలీవుడ్ మీడియాకు చెప్పారు