Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది.
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…