Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేశారు. కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి ప్రజలను చిన్నాపెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను చంపేశారు. 200కు పైగా మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే ఈ దాడుల తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 4000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.
Read Also: India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..
Also Read
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా, ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో లెబనాన్ మిలిటెంట్ సంస్థ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లు కూడా ఇజ్రాయిల్ పై దాడులకు సిద్ధమవుతున్నారని ఇజ్రాయిల్ మిలిటరీ ఆదివారం తెలిపింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ సరిహద్దులపై కాల్పులను తీవ్రం చేసింది. హిజ్బుల్లా, లెబనాన్ ను యుద్ధంలోకి లాగుతోందని, దీని వల్ల చాలా నష్టపోతారని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రతినిధి జోనాథన్ కన్రికస్ హెచ్చరించారు.
హిజ్బుల్లా చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతోందని, పరిస్థితి తీవ్రతను పెంచుతోందని, మేము ప్రతీరోజు దాడులను ఎదుర్కొంటున్నామని ఆయ అన్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కోసం లెబనాన్ ను ప్రజల శ్రేయస్సును, లెబనీస్ సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేసేందుకు లెబనాన్ సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఉత్తరాన, లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న 20,000 జనాభా ఉన్న పట్టణాన్ని ఇజ్రాయిల్ అధికారులు ఖాళీ చేయించారు. నిన్న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి గాలెంట్ మాట్లాడుతూ.. లెబనాన్ యుద్ధంలో చేరుతున్నట్లు సమాచారం ఉందని, ఇదే గనుక జరిగితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్‌ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!