New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Airfare Rules 2026: దేశంలో విమాన టికెట్ ధరలు తరచూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విమాన టికెట్ ధరల విషయంలో జోక్యం చేసుకునే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తూ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ముడి చమురు, విమాన ఇంధనం (ATF) ధరలు నిరంతరం పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారతీయ వాయుయాన్ నియమ్, 2026 (Bharatiya Vayuyan Niyam, 2026) పేరుతో ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, అసాధారణ పరిస్థితుల్లో విమాన టికెట్ ధరలపై జోక్యం అవసరమని కేంద్రం భావిస్తే, విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే పరిస్థితులకు అనుగుణంగా, తగిన పరిమితుల్లోనే ఈ ఆదేశాలు ఉండాలి. అలాగే నిర్దేశించిన కాలవ్యవధి వరకు మాత్రమే అమల్లో ఉంటాయి.
Also Read
- India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
- EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
రూల్ 192లో ఏముంది?
కొత్త నిబంధనల్లోని రూల్ 192 ప్రకారం, షెడ్యూల్డ్ విమాన సేవలు నిర్వహించే సంస్థలు తమ నిర్వహణ ఖర్చులు సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరలను నిర్ణయించుకోవాలి. ఈ ధరల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమర్పించాలి. అసాధారణ పరిస్థితి ఏర్పడిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. విమానయాన సంస్థలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
వెబ్సైట్లలో టికెట్ ధరలు తప్పనిసరిగా వెల్లడించాలి
ప్రయాణికులకు ధరల విషయంలో మరింత పారదర్శకత కల్పించేందుకు విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లు, ఇతర డిజిటల్ వేదికలపై టికెట్ ధరలను తప్పనిసరిగా ప్రచురించాలి. షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు నిర్ణయించే ఛార్జీలను DGCA పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా టికెట్ ధరలోని వివిధ భాగాలను విడివిడిగా వెల్లడించాల్సి ఉంటుంది. వాటిలో:
బేస్ ఫేర్ (ప్రాథమిక టికెట్ ధర)
పన్నులు
ఇతర ఫీజులు
టికెట్ రద్దు ఛార్జీలు
రీఫండ్‌కు సంబంధించిన నిబంధనలు
వర్తించే ఇతర అదనపు ఛార్జీలు
ఈ వివరాలను ప్రయాణికులకు స్పష్టంగా అందుబాటులో ఉంచాలి.
1994 నుంచి విమాన టికెట్ ధరల నిర్ణయం ఎలా ఉంది?
భారతదేశంలో 1994లో విమాన టికెట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వ నియంత్రణలను తొలగించారు. అప్పటి నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలే టికెట్ ధరలను నిర్ణయిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్, నిర్వహణ ఖర్చులు, టికెట్ బుక్ చేసుకునే సమయం వంటి అంశాల ఆధారంగా విమాన ఛార్జీలు మారుతుంటాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. ప్రయాణికులకు వేర్వేరు ధరల శ్రేణుల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
పాత నిబంధనలకు, కొత్త నిబంధనలకు తేడా ఏమిటి?
గతంలో అమల్లో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135(4) ప్రకారం.. విమానయాన రంగంలో అధిక ధరలు, పోటీని దెబ్బతీసే ధరల నిర్ణయం (Predatory Pricing), కొన్ని సంస్థల ఆధిపత్యంతో ఏర్పడే పోటీ పరిమిత పరిస్థితులు (Oligopolistic Practices) ఉన్నాయని DGCA గుర్తిస్తే ఆదేశాలు జారీ చేసే అధికారం ఉండేది. అయితే కొత్తగా నోటిఫై చేసిన రూల్ 192లో విమాన టికెట్ ధరల పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరలు, ప్రిడేటరీ ప్రైసింగ్, ఒలిగోపాలిస్టిక్ విధానాలను ప్రభుత్వ జోక్యానికి ప్రత్యేక కారణాలుగా స్పష్టంగా పేర్కొనలేదు. దీనికి బదులుగా, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తున్నాయి. ఈ అధికారం కూడా నిబంధనల్లో పేర్కొన్న షరతులకు లోబడి ఉంటుంది.
ప్రయాణికులపై ప్రభావం ఎలా ఉండవచ్చు?
కొత్త నిబంధనలతో విమాన టికెట్ ధరల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అసాధారణ పరిస్థితుల్లో ధరల విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేందుకు స్పష్టమైన నిబంధనల ఆధారం ఏర్పడింది. అయితే సాధారణ పరిస్థితుల్లో విమానయాన సంస్థలు మార్కెట్ పరిస్థితులు, నిర్వహణ ఖర్చులు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగానే టికెట్ ధరలను నిర్ణయిస్తాయి.
తాజావార్తలు
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!