LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక నగరం మంటల్లో చిక్కుకుంది. ఇళ్లు కాలి బూడిదయ్యాయి. వాహనాలు కరిగిపోయాయి. ఆకాశమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఆరిపోయిన తర్వాత కూడా ఆ నగరాన్ని మరో ప్రమాదం వెంటాడింది. కంటికి కనిపించని విషం గాలిలో కలిసిపోయింది. ఆ గాలిని పీల్చుకున్నది ఒక్కరో ఇద్దరో కాదు. ఏకంగా 70 లక్షల మంది.
2025 జనవరిలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను కుదిపేసిన కార్చిచ్చు సృష్టించిన భయానక పరిణామాలివి. ఈ మంటలు అడవులకే పరిమితం కాలేదు. జనావాసాల్లోకి చొచ్చుకెళ్లి ఇళ్లు, వాహనాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను దహించేశాయి. వాటి నుంచి వెలువడిన విషపూరిత పదార్థాలు పొగతో కలిసి వాతావరణంలోకి చేరాయి.
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణ స్థాయితో పోలిస్తే ఈ కార్చిచ్చు పొగలో సీసం స్థాయులు ఏకంగా 80 రెట్లకు పైగా పెరిగాయి. ఆర్సెనిక్ మూడు రెట్లు అధికంగా ఉంది. క్లోరిన్, బ్రోమిన్ స్థాయులు ఏడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఈటన్ ఫైర్ నుంచి వెలువడిన పొగలో విషపూరిత లోహాల సాంద్రత ప్రమాదకరంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ అసలు భయం మంటల్లో లేదు. ఆ మంటలు వదిలిన గాలిలో ఉంది. సీసం అనే విషపూరిత లోహం మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లల్లో మెదడు ఎదుగుదలను దెబ్బతీసి, ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.
Also Read
- INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
- Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
- Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
- Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
పెద్దల్లో అధిక రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇక ఆర్సెనిక్కు కొన్ని రకాల క్యాన్సర్లతో సంబంధం ఉంది. అయితే ఇంత తక్కువ సమయంలో అత్యధిక స్థాయిలో ఈ పదార్థాలకు గురికావడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడిందనే విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. ఈ అధ్యయనం లక్షలాది మంది విషపూరిత కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతోంది. వారిలో ఎంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చాయో మాత్రం నిర్ధారించలేదు. ఈ పరిశోధన మరో ప్రమాదకరమైన వాస్తవాన్ని గుర్తుచేస్తోంది. కార్చిచ్చు అంటే కేవలం చెట్లు, గడ్డి కాలిపోవడం మాత్రమే కాదు. మంటలు జనావాసాల్లోకి చేరినప్పుడు అవి వదిలే పొగ మరింత ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమంగా మారుతుంది.
ఇక మంటలు ఒక ప్రాంతాన్ని దహించవచ్చు. కానీ ఆ పొగ ప్రయాణం మాత్రం అక్కడితో ఆగిపోదు. మంటలకు మైళ్ల దూరంలో ఉన్న మనుషుల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరవచ్చు. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనుషులు ఇళ్లను ఖాళీ చేస్తారు. మరి కంటికి కనిపించకుండా వెంటాడే విషపూరిత పొగ నుంచి ఎలా తప్పించుకోవాలి? అదే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద ప్రశ్న.
తాజావార్తలు
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు