New York: సాధారణంగా ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే కాలుష్యంతోకూడుకున్న పొగ కమ్ముకుంటోంది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం అలముకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కాలుష్య పొగ కమ్మేసింది. మంగళవారం రాత్రి ఆ నగరంలో తీవ్ర కాలుష్యం నమోదు అయ్యింది. కెనడాలో చెలరేగుతున్న దావానలం వల్ల .. న్యూయార్క్ నగరంలో ఆకాశాన్ని పొగ కమ్మేసింది. నగరంలో కాలుష్యం అనారోగ్య స్థాయికి చేరుకున్నది. ఢిల్లీ, బాగ్ధాద్ నగరాల కన్నా న్యూయార్క్‌లో ఎక్కువ రేంజ్‌లో కాలుష్యం ఉన్నట్లు తేలింది.
Read also: Honda Car: హోండాలో ఈ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్..
న్యూయార్క్‌తో పాటు ఇతర అమెరికా నగరాలు స్మోక్‌తో ఇబ్బందిపడ్డాయి. డెట్రాయిట్ నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
న్యూయార్క్‌లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నగర ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. బయటి కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని సూచించారు. మంగళవారం రాత్రి 1.05 నిమిషాల సమయంలో న్యూయార్క్‌లో కాలుష్య ఇండెక్స్ 0-500 మధ్య ఉన్నట్లు తేల్చారు. గాలి నాణ్యత మరీ మరీ అనారోగ్యకరంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read also: Weather: పగలు ఉక్కపోత.. సాయంత్రం వాన.. మరో రెండు రోజులు ఇలాగే
కెనడాలో కార్చిచ్చు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. చాలా వేగంగా అడువులు అంటుకుంటున్నాయి. ఇప్పటి వరకు 3.3 మిలియన్ల హెక్టార్లలో అడవి కాలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 413 చోట్ల కార్చిచ్చు ఘటనలు నమోదు అయ్యాయి. 26 వేల మంది కెనడియన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు.