Hilarious Plan: కోహినూర్ వజ్రం భారత్‌కు రావాలంటే ఇదే దారి..! పీఎం కిడ్నాప్ ప్లాన్ చేసిన వ్యాపారవేత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ సంపద కోహినూర్ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్ పీఎం రిషి సునాక్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.. ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.. రిషి సునాక్- నెహ్రా దాదాపుగా ఒకేలా ఉండటం.. హావభావాలు, ఒడ్డు పొడుగు ముఖ కవళికలు.. దాదాపు ఒకేలా ఉండటం.. ఇద్దరి వయస్సు కూడా దగ్గరగానే ఉన్నాయి.. అయితే, కోహినూర్‌ను భారత్‌కు తప్పించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేశారు..
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇక ట్విట్టర్ చీఫ్..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేయడం ఏంటి? ఎవరిని కిడ్నాప్ చేస్తే కోహినూర్ వజ్రం భారత్‌కు వస్తుంది.. అనే విషయాల్లోకి వెళ్తే.. యూకే ప్రధాని రిషి సునాక్‌ను మొదట భారత్‌కు రప్పించాలి.. బెంగళూరులో తన మామగారైన (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు.. ఆయన్ను కిడ్నాప్ చేయాలని.. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను పంపాలన్నారు.. ఆ తేడా ఎవరూ గమనించలేరు.. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి రప్పించే బిల్లును వెంటనే ఆమోదించమని నెహ్రాకు సూచించాలని.. అలా కోహినూర్ వజ్రం భారత్‌కు తీసుకురావొచ్చు అనే కోణంలో ఎమోజీలను షేర్ చేశారు హర్ష గోయెంకా.. మొత్తంగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
కోహినూర్‌ను తిరిగి పొందాలని నా స్నేహితుడి ఆలోచన అంటూ వరుసగా నాలుగు పాయింట్లను సూచించారు
1. రిషి సునాక్‌ని భారతదేశానికి ఆహ్వానించండి..
2. అతను తన అత్తమామల కోసం బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు అతన్ని కిడ్నాప్ చేయండి.
3. బదులుగా ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానిగా పంపండి. దానిని ఎవరూ గ్రహించలేరు.
4. కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్లును పాస్ చేయమని నెహ్రాకు చెబుతారు. అంటూ పాయింట్లు రాసుకొచ్చారు.
My friend’s idea to get back #Kohinoor:
1. Invite #RishiSunak to India
2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws
3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it.
4. Nehra will be told to pass the bill to return Kohinoor💎 in 🇮🇳! 😀😀
— Harsh Goenka (@hvgoenka) October 25, 2022
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!