Great Love Story: టీనేజ్ లవ్ కానీ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో 60 ఏళ్ల పాటు ఎడబాటును భరించారు. చివరకు లేటు వయసులో పెళ్లితో ఒకటయ్యారు. ఈ గ్రేట్ లవ్ స్టోరీ ప్రస్తుతం బ్రిటన్ లో హాట్ టాపిక్ గా మారింది. 1963లో లెన్ 19 ఏళ్లు, జీనెట్ కి 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. న్యూ పోర్ట్ లోని సెయింట్ మేరీస్ హాస్పిటన్ లో నర్సులుగా పనిచేస్తున్నప్పుడు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
Read Also: Girl Friend On Rent: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. చైనా యువకుల కొత్త ప్లాన్
వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అమ్మాయి జీనెట్ స్టీర్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే జీనెట్ కు వివాహం చేసుకోవడానికి చట్టపరమైన అనుమతి ఉన్న 21 ఏళ్ల వయస్సు లేదు. మూడేళ్లు తక్కువ వయస్సు ఉండటంతో తల్లిదండ్రులు వద్దని చెప్పారు. దీంతో చేసేదేం లేక అటు లెన్ ఆల్ బ్రైటన్, జీనెట్ స్టీర్ విడిపోయారు. ఇద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. లెన్ ఆస్ట్రేలియాలో, జీనెట్ ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యారు.
60 ఏళ్ల తరువాత లెన్ ఆస్ట్రేలియా నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ను వెతుక్కుంటూ ఇంగ్లాండ్ వచ్చాడు. చిరవకు ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వివాహ జీవితం అద్భుతంగా ఉందని, నన్ను గౌరవంగా చూసే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. లెన్ తాము మరోసారి ప్రేమలో పడ్డాం అని మురిసిపోతున్నాడు. ప్రస్తుతం లెన్ ఆల్‌బ్రైటన్ కు 79, జీనెట్ స్టీర్ 78 ఏళ్లు.