G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
- ఫ్రాన్స్ వేదికగా ప్రస్తుతం జీ 7 సదస్సు
- ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్ వేదికగా ప్రస్తుతం జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అయితే సమ్మిట్‌లో ట్రంప్ ఒంటరిగా నిలబడిన ఫొటో వైరల్ అవుతోంది. సదస్సు ప్రారంభానికి ముందు ప్రపంచ నేతలు ఒకచోట చేరి చర్చల్లో పాల్గొనగా.. ట్రంప్ మాత్రం కొంత దూరంలో ఒంటరిగా నిలబడి కనిపించడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అయిన ఫొటోలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరస్పరం చర్చలు జరుపుతున్నట్లు కనిపించారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం కొద్దిదూరంలో ఒంటరిగా నిలబడి ఉండటం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
Also Read
ఇటీవల ప్రకటించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఈ సదస్సులో ప్రధాన చర్చాంశంగా మారింది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో తదుపరి దశ చర్చలు తొలి చర్చల కంటే సులభంగా ఉంటాయని చెప్పారు. అలాగే అమెరికా ఇరాన్‌కు ఆర్థిక సహాయం అందించబోదని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసంతృప్తి
లెబనాన్ అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హిజ్బుల్లాపై పోరాటంలో ఇజ్రాయెల్ చర్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అధిక ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే సిరియా మరింత సమర్థంగా వ్యవహరించగలదని కూడా వ్యాఖ్యానించారు.
జెలెన్స్కీతో భేటీ
ఇక సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!