US: రోజుకి వేల మంది పుడతారు. వందల మంది మరణిస్తారు. కానీ కొందరు మాత్రం మరణించి కూడా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఇలా పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న చిన్న జీవితంలో మనం ఎలా జీవించాం.. నలుగురికి ఎలా ఉపయోగ పడ్డాం అనేదే మరణించిన తరువాత కూడా బ్రతికి ఉండేలా చేస్తుంది. ఈ కోవలోకే వస్తుంది రోజలిన్ కార్టర్ అనే మహిళ. వివరాలలోకి వెళ్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ మంచి మనసున్న వ్యక్తి. ఆమె మానవతా దృక్పధంతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసింది. ప్రజలకు ఆమె అందించిన సేవల తో గొప్ప మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
Read also:Maxico : మెక్సికోలో పెను ప్రమాదం.. కూలిన టవర్.. ఐదుగరు కార్మికులు మృతి
అలానే మనిషికి మానసిక ఆరోగ్యం చాల అవసరమని.. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం బావుంటుందని.. మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిపించేందుకు రోజలిన్ తన భర్త జిమ్మీ కార్టర్‌తో కలిసి కార్టర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా గత కొంత కాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం 96 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తాజాగా కార్టర్ సెంటర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త జిమ్మీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యారు. 77 ఏళ్ళ తమ వైవాహిక బంధంలో తన ప్రతి విజయంలో తన భార్య తోడుగా ఉందని.. తన విజయాల్లో తన భార్య కూడా సమాన భాగస్వామి అని పేర్కొన్నారు. తన భార్య తనను విడిచి వెళ్లడంపైన విచారం వ్యక్తం చేశారు.