Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..
- ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్..
- మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో అసిమ్ మునీర్ రాజ్యం నడుస్తోంది. పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అంతా మునీర్ కనుసన్నల్లోనే పాలన ఉంటోంది. ఇటీవల, పాక్ త్రివిధ దళాలకు అధిపతిగా ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)’’ పదవిని స్వీకరించారు. దీని తర్వాత, పాకిస్తాన్ అధ్యక్షుడికి సమానంగా, అసిమ్ మునీర్ అధికారాలు ఉన్నాయి. ఏకంగా ఆ దేశ న్యూక్లియర్ బటన్ కూడా ఇతడి చేతిలోనే ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మునీర్ తన ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్నాడు.
పాకిస్తాన్ మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం, అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై కోర్టు మార్షల్ చేసి, ఆయను దోషిగా నిర్ధారించారు. నిజానికి పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ తర్వాత, అత్యంత శక్తివంతమైన పోస్టుల్లో ఐఎస్ఐ చీఫ్ రెండోది. ఈ హోదాలో పనిచేసిన వ్యక్తికి ఆ దేశంలో అత్యున్నత గౌరవం దక్కుతుంది. సైన్యంలో పరపతి ఉంటుంది. కానీ ఫైజ్ హమీద్ కేసులో మాత్రం ఇది పూర్తిగా రివర్స్‌గా జరిగింది. పాక్ ఆర్మీ చట్టం కింద 15 నెలల పాటు హమీద్‌పై విచారణ జరిగింది. అయితే, ఆయన వల్ల సైన్యానికి ఏం నష్టం కలిగిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అతడికి అప్పీలు చేసుకునే హక్కు ఉంటుందని సైనిక కోర్టు చెప్పింది.
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
హమీద్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇమ్రాన్ హయాంలోనే ఈయన ఐఎస్ఐ చీఫ్‌గా పదవి పొందారు. 2024లో ఇస్లామాబాద్ సమీపంలోని టాప్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంతర్గత దర్యాప్తు తర్వాత అదుపులోకి తీసుకోబడ్డారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. గురువారం ఆయనపై నమోదైన కేసుల వివరాలు, విచారణ సమాచారాన్ని ప్రభుత్వం కానీ, సైన్యం కానీ వెల్లడించలేదు.
Read Also: శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్:
అసిమ్ మునీర్, ఫైజ్ హమీద్‌కు గతం నుంచే శత్రుత్వం ఉంది. ఇమ్రాన్ ఖాన్‌తో హమీద్‌కు రాజకీయ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 2019లో ఇప్పటి సీడీఎఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా తొలగించి, ఆ స్థానంలో ఫైజ్ హమీద్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా ఇమ్రాన్ ప్రభుత్వం నియమించింది. మునీర్‌ను గుజ్రాన్వాలా కార్ప్స్ కమాండర్‌గా మార్చారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించి, షహబాజ్ షరీఫ్ ప్రధానిగా చేశారు. అసిం మునీర్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో 2022లో పాక్ ఆర్మీ చీఫ్ అయ్యారు. 2025లో ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేయడంతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) గా కూడా నియమించారు. ఈ కోపం కారణంగానే మునీర్ ఇమ్రాన్ ఖాన్, హమీద్‌లను కేసులు మోపి జైలులో పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!