బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు.
ఖలీదా జియా బంగ్లాదేశ్‌లో రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. భర్త జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించినా ప్రజాస్వామ్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 17 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 2024లో జైలు నుంచి విడుదలయ్యారు.
బయోడేటా..ఖలీదా జియా 1945లో దినాజ్‌పూర్ జిల్లాలోని జల్పైగురిలో జన్మించారు. (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్). ఐదుగురు సంతానంలో ఖలీదా జియా మూడో సంతానం. తండ్రి ఇస్కందర్ అలీ, తల్లి తైయాబా మజుందర్. 1947లో భారతదేశ విభజన తర్వాత దినాజ్‌పూర్ (బంగ్లాదేశ్)కు వెళ్లిపోయారు. 1960లో పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న జియాపూర్ రెహమాన్‌ను వివాహం చేసుకుంది. భర్త మొదటి పేరును ఇంటిపేరుగా ఖలీదా జియాగా మార్చుకుంది. 1965లో భర్తతో కలిసి ఉండటానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. 1969లో తూర్పు పాకిస్థాన్‌కు మారారు. భర్త పోస్టింగ్ కారణంగా కుటుంబం చిట్టగాంగ్‌కు మారింది.
ఖలీదా జియా మొదటి కుమారుడు తారిఖ్ రెహమాన్ 1967లో జన్మించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. రెండో కుమారుడు అరాఫత్ రెహమాన్ 1969లో జన్మించాడు. 2015లో గుండెపోటుతో జన్మించాడు.

ఇక ఖలీదా జియా 1971లో చిట్టగాంగ్ నుంచి ఢాకా చేరుకున్నారు. 1981 మే 30న ఖలీదా జియా భర్త, బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాపూర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. భర్త మరణం తర్వాత 1982లో జనవరి 2న రాజకీయాల్లోకి వచ్చారు. భర్త స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సభ్యురాలిగా ప్రస్థానం ప్రారంభించింది. 1983లో వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1991-1996 వరకు, 2001-2006 వరకు బంగ్లాదేశ్‌కు రెండు సార్లు ప్రధానిగా పని చేశారు. ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: Off The Record: ఆ ఎమ్మెల్యే అటు ఇటు కానీ హృదయంతో అల్లాడిపోతున్నారా..?
#WATCH | Bangladesh | Visuals from outside of Evercare Hospital, Dhaka, where Bangladesh's first female Prime Minister, Khaleda Zia, passed away earlier today, at the age of 80. pic.twitter.com/2lEzDYX818
— ANI (@ANI) December 30, 2025
#WATCH | From ANI archives – The life and times of Bangladesh's first female Prime Minister, Khaleda Zia, who died earlier today at the age of 80. pic.twitter.com/qkIT6IYTve
— ANI (@ANI) December 30, 2025
#WATCH | From ANI archives – The life and times of Bangladesh's first female Prime Minister, Khaleda Zia, who died earlier today at the age of 80. pic.twitter.com/8mpaQoCBG5
— ANI (@ANI) December 30, 2025
#WATCH | From ANI archives – The life and times of Bangladesh's first female Prime Minister, Khaleda Zia, who died earlier today at the age of 80. pic.twitter.com/bGWbbNcwmX
— ANI (@ANI) December 30, 2025