ఒక క‌రెంట్ స్థంబంలో అనేక ఫీచ‌ర్లు… ఇండియాలో మొద‌టి స్మార్ట్ పోల్‌…

ఇప్పుడు ప్ర‌పంచం స్మార్ట్ దిశ‌గా పరుగులు తీస్తున్న‌ది.  ఒకే చోట అన్ని ర‌కాల వ‌స‌తులు ఉండే విధంగా ఉత్ప‌త్తులు త‌యార‌వుతున్నాయి. ఇక దేశంలో అనేక స్మార్ట్ సిటీల‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.  దేశంలో అభివృద్ధి ప‌దంలో దూసుకుపోతున్న రాష్ట్రాల్లో గుజ‌రాత్ ముందువ‌ర‌స‌లో ఉన్న‌ది.  గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ లో దేశంలోనే తొలి స్మార్ట్‌పోల్ ను ఏర్పాటు చేశారు.  అహ్మ‌దాబాద్‌లో మొత్తం ఇలాంటి పోల్ స్థంబాలు మొత్తం 19 ఏర్పాలు చేశారు.  ఇందులో రెండు ర‌కాల స్థంబాలు ఉన్నాయి.  

Read: ఆ బాధ తట్టుకోలేక పోర్న్‌ స్టార్‌ ఆత్మహత్య

అందులో ఒక‌టి ఒక మీట‌ర్ స్మార్ట్ పోల్ కాగా, రెండోది 10 మీట‌ర్ల స్మార్ట్ పోల్‌.   ఇందులో అనేక ర‌కాల ఫీచ‌ర్లు ఉన్నాయి.  వైఫై రూటర్, 30 వాట్ల ఎల్ఈడీ ఫిక్చర్స్, పీటీజెడ్ కెమెరా,  30 వాట్ల పీఏ స్పీకర్, యూఎస్‌బీ చార్జింగ్ సాకెట్,  ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్, వాతావరణ కేంద్రం,  బిల్ బోర్డు డిస్‌ప్లే,  ఎమర్జెన్సీ పుష్ బటన్ వంటి సౌక‌ర్యాలు ఒకే పోల్‌లో ఉన్నాయి.  ఒక్కో పోల్ ఏర్పాటుకు రూ.2 కోట్ల రూపాయ‌ల ఖర్చు చేసింది ప్ర‌భుత్వం.  ఈ స్మార్ట్ పోల్‌లు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్నాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-