Ozone Layer: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లతో ఓజోన్ పొరకు ప్రమాదం.. సైంటిస్టుల వార్నింగ్..
- ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లతో ఓజోన్ లేయర్‌కి ప్రమాదం..
- ఓజోన్ క్షీణతకు కారణమవుతుందని సైంటిస్టుల వార్నింగ్..
- వేల సంఖ్యలో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని స్టార్‌లింక్ ప్లాన్..
- అల్యూమినియం ఆక్సైడ్స్‌తో ఓజోన్ విధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు. అయితే, ఈ శాటిలైట్లు భూమిని రక్షిస్తున్న ఓజోన్ లేయర్‌ని దెబ్బతీసే అవకాశం ఉందని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ వాతావరణంలో అధిక మొత్తంలో అల్యూమినియం ఆక్సైడ్ వాయువును వెదజల్లుతుందని, అది ఓజోన్ పొరను క్షీణింపజేస్తుందని పేర్కొంది.
సూర్యుడి నుంచి వచ్చే అతినీలతోహిత కాంతిని ఓజోన్ పొర అడ్డగించి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుంది. ఒక వేళ ఈ పొర క్షీణిస్తే భూమిపై ఉన్న జంతువులు, వృక్షజాలానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. మనుషులు, జంతువులకు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పంటల దిగుబడి, ఆహార ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది.
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
Read Also: MSP: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..
స్టార్‌లింక్ శాటిలైట్లు దిగువ భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. ఈ ఇంటర్నెట్ శాటిలైట్ల జీవితకాలం దాదాపు 5 ఏళ్లు. ప్రస్తుతం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో 8000 కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 6000 స్టార్‌లింక్ శాటిలైట్లే. వీటి జీవితకాలం ముగిసిన సందర్భంలో ఇవి భూమిపై కూలిపోతాయి. అయితే, భూ వాతావరణ ఘర్షణ కారణంగా ఇవి భూమి పైకి చేరేలోపే కాలిపోతాయి. దీని ఫలితంగా ఏటా 1000 టన్నుల అల్యూమినియం ఆక్సైడ్స్ వెలువడుతాయి. ఓ విధంగా చెప్పాలంటే 646 శాతం ఈ వాయువుల పెరుగుదల ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్‌లు ఓజోన్‌ను క్లోరిన్‌తో విధ్వంసకర చర్యకు కారణమవుతాయి.
లోయర్ ఎర్త్ ఆర్బిట్ నుంచి శాటిలైట్లు కూలిపోయేందుకు భూ వాతావరణంలోకి వచ్చే సమయంలో అవి కాలిపోయి అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్పత్తి చేస్తాయి. ఇది స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొరను క్షీణింపచేసి క్లోరిన్ యాక్టివేషన్ క్రిష్టల్స్ విడుదలవుతాయని పరిశోధకులు చెప్పారు. సాధారణంగా 250 కిలోల శాటిలైట్ సుమారుగా 30 కిలోల అల్యూమినియ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌ని ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నారు. ఇది దశాబ్ధాలుగా వాతావరణంలో ఉంటాయి. 2016 మరియు 2022 మధ్యకాలంలో ఆక్సైడ్ల ఉనికి దాదాపు ఎనిమిది రెట్లు పెరిగిందని మరియు ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ ప్రణాళికలతో మరింత పెరగవచ్చని అధ్యయనం కనుగొంది. స్పేస్ ఎక్స్ మాత్రమే మరో 42,000 స్టార్‌లింక్ శాటిలైటన్లను ప్రయోగించడానికి అనుమతి కలిగి ఉంది. రాబోయే ఏళ్లలో వేలాది శాటిలైట్లనను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!