Crown Prince of Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8-9 తేదీల్లో భారత్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం చేయడానికి పలు సమావేశాల్లో పాల్గొననున్నారు.
Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆయన భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ శనివారం వారి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఆడబిడ్డకు ‘‘హింద్’’గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తన తల్లి షేఖా హింద్ బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్థం నవజాత శిశువుకు 'హింద్' అని పేరు పెట్టారు.
Dubai Crown Prince: ఓ దేశానికి రాజు అంటే ఆయనకు సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు ఎక్కడికి వెళ్లినా సకల భోగాలను అనుభవించాల్సిందే. భద్రత దృష్ట్యా వాళ్లు విమానాలు, హెలికాప్టర్లు, కార్లలో తిరుగుతుంటారు. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ మెట్రోలో సామాన్య పౌరుడిగా పర్యటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. కానీ సదరు యువరాజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన్ను…