A.R. Rehman: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం అనే చెప్పాలి. ఇక నిన్నటితో ఏఆర్ రెహమాన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. మణిరత్నం దర్శకత్వం వచ్చిన రోజా చిత్రంతో ఏఆర్ రెహమాన్ తన సంగీత పయనాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే అవార్డును కూడా కైవసం చేసుకొని అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డును అందుకున్న రెహామన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అది ఏంటంటే.. ఏఆర్ రెహమాన్ చిన్ననాటి ఫోటో. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో చిన్నారి ఏఆర్ రెహమాన్ ఎంతో అమాయకంగా చూస్తూ కనిపించాడు. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా 50 ఏళ్ల క్రితం అని జోడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఎంతో ముద్దుగా ఉన్నారు అని కొందరు.. అప్పటికే సంగీతం నేర్చుకున్నట్లు ఉన్నారు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
50 years ago 😃 pic.twitter.com/rCe69p04vd
— A.R.Rahman (@arrahman) August 16, 2022