Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు.