Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు.
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు
Vivek Ramaswamy: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి భారతీయ అమెరికన్లు అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2020లో ట్రంప్ ఓడిపోయిన సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ హామీ ఇచ్చారు.
Stormy Daniels: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ల తరుపున పోటీ చేద్ధాం అని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ శృంగార తార చేసిన ఆరోపణలు ఆయన్ను జైలు పాలయ్యేలా చేస్తున్నాయి. ఈ పోర్న్ స్టార్ పేరే స్టార్మీ డేనియల్స్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ట్రంప్ తో శృంగారం గురించి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లను అందించినట్లు స్టార్మీ డేనియల్స్ ప్రకటించడం అమెరికాను ఓ కుదుపుకుదిపేసింది.…