26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆరోపణలపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు పంపింది. సివిల్ కేసులో హత్యకు కుట్ర పన్నారని పన్నూ ఆరోపిస్తూ.. పన్ను దావా వేశాడు. ఈ సమన్లు పూర్తిగా సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ సమన్లు జారీ చేసింది. ఇందులో భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్…
Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు.
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావు… గ్లామరస్ జీవితాలు పైకి మెరిసిపోయినంత అందమైనవి కావు! తాజా ఉదాహరణ బ్రిట్నీ స్పియర్స్! అందం, అభినయం, గాత్రం, గ్లామర్… అన్నీ ఉన్నా… తనకు స్వేచ్ఛ లేదంటోంది అమెరికన్ పాప్ స్టార్!39 ఏళ్ల బ్రిట్నీ లాస్ ఏంజిలెస్ కోర్టులో తన మానసిక వేదన మొత్తం బయట పెట్టింది. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో స్పియర్స్ కు తీవ్రమైన…