అయోధ్యలో (Ayodhya) మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు మత పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మక్కా నుంచి తీసుకొస్తున్న వస్తువుతో పునాది వేయాలని మత పెద్దలు నిర్ణయించారు. బంగారు రంగులో ఆయాత్‌లతో కూడిన పవిత్ర నల్లమట్టితో తయారు చేసిన ఇటుకను (Black Soil Brick) తీసుకొస్తున్నారు. ఈ ఇటుకతోనే మసీదుకి పునాది వేయనున్నారు. ఏప్రిల్ నాటికి ఈ ఇటుక అయోధ్యకు చేరుకుంటుంది. మక్కా నుంచి కొంతమంది ఆఫీస్ బేరర్లు తీసుకువచ్చారని మత పెద్దలు పేర్కొన్నారు. ఈ ఇటుకతోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉంటే జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖల మధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయోధ్యలో మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే మక్కా మసీదు నుంచి పవిత్ర ఖురాన్‌ను కూడా తీసుకొస్తున్నారు. అయోధ్యలోని ధన్నీపూర్‌లో బాబ్రీ మసీదుకు బదులుగా కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో ఈ మసీదు నిర్మాణం చేపట్టనున్నారు.
బ్లూప్రింట్ ఇలా..
మసీదు యొక్క కొత్త బ్లూప్రింట్ ప్రకారం.. ఇది 340 అడుగుల ఎత్తులో ఐదు మినార్లతో దేశంలోనే మొదటి మసీదుగా నిలవబోతుంది. మినార్లు ఇస్లాం యొక్క ఐదు సిద్ధాంతాలను హైలైట్ చేస్తాయి. షహదా (విశ్వాసం యొక్క ప్రకటన), సలాహ్ (ప్రార్థన లేదా నమాజ్), సామ్ (ఉపవాసం లేదా రోజా), జకాత్ (దాతృత్వం) మరియు హజ్ ఉంటుంది.
రెండు భాగాలుగా..
మొత్తం మసీదు రెండు భాగాలుగా విభజించబడింది. బేస్మెంట్ ప్రాంతం మరియు గ్రౌండ్ ఫ్లోర్. నేలమాళిగ ప్రాంతం ఒక బహుళార్ధసాధక హాల్, అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకేసారి 9,000 కంటే ఎక్కువ నమాజీలు ఉండగలిగే సామర్థ్యంతో విశాలమైన నమాజ్ హాల్ ఉంటుంది. నమాజ్ హాల్‌కు ఐదు ఎంట్రీలు ఉంటాయి. ఇది కేవలం ప్రార్థనలు చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. మహిళా నమాజీలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.