KTR Tweet: కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్..
- కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
- కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ మండిపడ్డారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు అంటూ ట్వీట్ చేశారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ తెలిపారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడంటూ మండిపడ్డారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు – ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు అంటూ నిప్పులు చెరిగారు. నీ మూసి ముసుగులు కాదు – కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అని ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ పై మండిపడ్డారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు – పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు అన్నారు. నీ కాసుల కక్కుర్తి – నీ కేసుల కుట్రలు కాదు – పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడాలని సీఎంకు తెలిపారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడాలని కేటీఆర్ ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rangareddy Fire Accident: కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
Also Read
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!