Josh Inglis: జోష్ ఇంగ్లిస్ పాకిస్థాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెర్త్‌లో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. దీనికి కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు. దింతో వన్డే, టీ20లకు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. వైట్ బాల్ క్రికెట్‌లో జోష్ ఇంగ్లిస్‌కు ఆస్ట్రేలియా బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్‌గా, అతను వన్డేలో పాట్ కమిన్స్ ను, అలాగే టి20 ఇంటర్నేషనల్‌లో మిచెల్ మార్ష్‌ను భర్తీ చేస్తాడు. జోష్ ఇంగ్లిస్ ఆస్ట్రేలియాకు వన్డేల్లో 30వ కెప్టెన్‌గా, టీ20లో 14వ కెప్టెన్‌గా నిలవనున్నాడు. పాకిస్తాన్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో జోష్ ఇంగ్లీష్ బాధ్యతలు చేపట్టనున్నారు.
జోష్ ఇంగ్లీష్ కెప్టెన్సీకి సంబంధించి, పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు మాత్రమే అతన్ని కెప్టెన్‌గా నియమించారని తెలుస్తోంది. దీని వెనుక కారణం ఖచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. దీని కోసం నవంబర్ 22 నుండి భారత్ – ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా రెగ్యులర్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్, టి20 కెప్టెన్ మిచెల్ మార్ష్ దీని కోసం సన్నద్ధమవుతున్నారు. అందువల్ల పాకిస్తాన్‌తో సిరీస్‌లో వీరు ఆడడం లేదు. పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో మూడో వన్డే నుంచి ఆస్ట్రేలియా జట్టుకు జోష్ ఇంగ్లీష్ నాయకత్వం వహిస్తాడు. నవంబర్ 10న ఇరు దేశాల మధ్య మూడో వన్డే జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 18 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
Read Also: Donald Trump: పెన్సిల్వేనియాలో కమలా హరీస్ భారీ లీడింగ్.. ట్రంప్ ఆరోపణలు..
ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ తో జరిగే రెండో వన్డేలో పాట్ కమిన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్‌లతో పాటు ఈ ఆటగాళ్లంతా వన్డే సిరీస్‌కు దూరమై భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నారు.