NTV Telugu Site icon

Donald Trump: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..!

Trump

Trump

Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు. ఇది భారతీయులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే, అమెరికాకు రావాలని అనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి.. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని డొనాల్డ్ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

Read Also: Mumbai: కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి

అయితే, కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు డైరుక్టుగా అమెరికాకు వచ్చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు యూఎస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వొద్దని తెలిపారు. వారిని తక్షణం వెళ్లగొట్టాలని ఆయన చెప్పారు. ఇక, అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు.. వారిలో చాలా మంది గొప్ప మంచి ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారు.. కాట్టి వారి సమస్య తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. డ్రీమర్స్‌ సమస్యకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ(92) కన్నుమూత.

పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10,000 కోట్ల డాలర్లు, మెక్సికోకు 30,000 కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తోందనీ, వీటిని కట్టిపెట్టాల్సి ఉందన్నారు. చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్‌ పౌరులు నష్టపోతారని కంపెనీల సీఈవోలు కొందరు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్‌ తోసిపుచ్చారు. సుంకాల సాయంతో తాను యుద్ధాలు ఆపానన్నారు.