Google Employee Earning More Than 1 Crore By Doing 1 Hour Work Daily: ఈరోజుల్లో కోట్లలో జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి కానీ.. ఓ ఉద్యోగి మాత్రం కేవలం రోజుకి గంట మాత్రమే పని చేసి, ఏడాదికి రూ.1.50 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.20 కోట్లు) సంపాదిస్తున్నానని కుండబద్దలు కొట్టాడు. ఇటీవల ఫార్చూన్ అనే పత్రికకి అతడిచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయం తెలిపాడు. అతని పేరు డేవాన్ (20). గూగుల్ సంస్థలో అతడు పని చేస్తాడు. అయితే.. ఇతర ఉద్యోగుల తరహాలో తాను రోజంతా కష్టపడనని, కేవలం గంట మాత్రమే పని చేస్తానని అన్నాడు.
iPhone 14 Price: అమెజాన్‌లో డిస్కౌంట్ ఆఫర్.. ఐఫోన్ 14 కొనేందుకు ఇదే మంచి సమయం!
నిజానికి.. మేనేజర్ ఇచ్చే కోడ్‌ను పూర్తి చేసేందుకు కనీసం వారం రోజులు పడుతుందని, అయితే తాను కోడ్‌లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని డేవాన్ పేర్కొన్నాడు. మిగిలిన పనిని వారం రోజుల్లోపు తాపీగా పూర్తి చేస్తానన్నాడు. తాను కోడ్ రాయడానికి కేవలం గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తానన్నాడు. ఉదయం అల్పాహారం చేశాక గంట పాటు గూగుల్ కోసం పని చేస్తానని.. మిగిలిన సమయాన్ని తన స్టార్టప్ కోసం వినియోగిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్‌లో పని చేసే వారికి చాలా ప్రయోజనాలుంటాయని.. ఎందరో ఇంజనీర్లు గొప్ప జీతాలు అందుకుంటున్నారని.. వారిలో తానొకడినని అన్నాడు. ప్రస్తుతం అతడిచ్చిన ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
FIFA Women World Cup: ముదిరిన ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ప్రధాని ఆగ్రహం
కేవలం డేవాన్ మాత్రమే కాదు.. గతంలోనే ఓ ఉద్యోగి తక్కువ గంటలు పని చేసి ఎక్కువ మొత్తం ఆర్జిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో షాకిచ్చాడు. జాసన్ అనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి.. తాను వారానికి 30 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయనని.. పనిభారం తక్కువగా ఉండటం వల్ల తాను రెండు ఫుల్‌టైం ఉద్యోగాలు చేస్తున్నానని బాంబ్ పేల్చాడు. ఒకవేళ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే.. తాను రెండు ఉద్యోగాలు చేయకుండా, కేవలం ఒక ఉద్యోగమే చేసేవాడినని చెప్పుకొచ్చాడు.