Deniel Rubber Man: ఎవరికైనా ఏదైనా వ్యాధి సోకితే చాలా ఇబ్బంది పడతారు. కొందరు డిప్రెషన్‌లోకి కూడా వెళతారు. అయితే అమెరికాకు చెందిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ తనకు సోకిన అరుదైన వ్యాధిని అవకాశంగా మార్చుకున్నాడు. శరీరాన్ని మెలితిప్పడం ద్వారా దాదాపు 7 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. దీంతో రబ్బర్ బాయ్ గా గుర్తింపు పొందుతున్నాడు. అయితే డేనియల్ శరీరాన్ని ఎటుపడితే అంటు అవలీలగా వంచగలడు. ఇంకో విషయం ఏమిటంటే, అతను తన శరీరాన్ని మొత్తం మడతపెట్టి, ఒకేసారి ఒక పెట్టెలో వెళ్ళగలడు. ఇలా అద్భుతాలు చేస్తూ ఎన్నో ప్రకటనలు, టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.
Read also: Krithi Shetty : బికినీలో బేబమ్మ.. డోస్ పెంచుతోన్న కృతి శెట్టి
అమెరికాలోని మెరిడియన్ ప్రాంతంలో జన్మించిన డేనియల్ తన చిన్నతనంలో చాలా ఎత్తు నుంచి నేలపైకి దూకేవాడు. 2007లో, అతను మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్‌గా గిన్నిస్ బుక్ అవార్డును గెలుచుకున్నాడు. ఇలా మొత్తం ఏడు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. అయితే అతను తన శరీరాన్ని తనకు కావలసిన విధంగా వంచడానికి అసలు కారణం ‘ఎల్లస్ డన్లోస్ సిండ్రోమ్’ అనే వ్యాధి. జన్యుపరమైన లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారినపడినవారి శరీరంలోని కీళ్లు ఎన్ని వంపులైనా తిరుగుతాయి. అయినప్పటికీ, ఈ వ్యాధి సోకిన చాలా మంది తీవ్రమైన కండరాలు మరియు ఎముకల నొప్పితో కూడా బాధపడుతుంటారు, అయితే డేనియల్ కు కొంతవరకు మాత్రమే నొప్పి ఉంటోంది. దీన్నే అవకాశంగా మలుచుకున్న డేనియల్ తాను ఎంచుకున్న రంగంలో రాణించగలుగుతున్నాడని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా చేయాలంటే ధైర్యం, సహనం, ఓర్పు, తెలివి తప్పక అవసరం. వ్యాధి సోకిందని కుంగిపోకుండా తనకున్న ఆవ్యాధితోనే గిన్నిస్ బుక్ లో ఎక్కిన డానియల్ జీవితం అందరికి ఒకస్పూర్తి అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
Asvins: నిమిషమున్నర టీజర్ తోనే భయపెట్టారు మావా…