ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ అయ్యింది తుళు అందం కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది.

పుట్టి పెరిగింది  ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ వరుస అవకాశాలను ఒడిసిపడుతోంది.

అయితే.. శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది.  శ్రీలీల , కృతి శెట్టి ఆఫర్స్ మొత్తం కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే కృతి శెట్టి గురించి లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 ప్రస్తుతం కృతి ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో కృతిశెట్టికి బంపర్ ఆఫర్ వచ్చిందని లేటెస్ట్ టాక్. 

అయితే ఈ సినిమాలో కృతి పాత్ర కాస్తా గ్లామరస్‌గా ఉంటుందట. అందులో భాగంగా ఓ సన్నివేశంలో కథకు తగ్గట్లు కృతి బికినీలో కనిపించనున్నారట. 

అయితే ఈ సినిమాలో బికినీ ధరించేందుకు నిర్మాతలు కృతికి రూ. 4 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. 

అయితే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటిని బికినీలో చూడలేమని.. ఇది ఓ రకంగా రక్త కన్నీరు లాంటీదేనని అంటున్నారు.