Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్‌లోనే ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama Says He Will Not Return To China: తాను చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, ఇండియాలోనే ఉంటానని బౌద్ధ గురువు దలైలమా సోమవారం స్పష్టం చేశారు. భారత్‌ను అత్యుత్తమ దేశంగానూ అభివర్ణించిన ఆయన.. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలతో పాటు చైనాలోనూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ నేను చైనాకు తిరిగి వెళ్లను. భారత్‌లోనే ఉంటాను, ఇదే ఉత్తమమైన దేశం, కాంగ్రా-పండిట్ నెహ్రూనే నా శాశ్వత నివాసం’’ అంటూ దలైలమా చెప్పుకొచ్చారు.
Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్‌ని నిర్బంధించి..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
కాగా.. టిబెట్‌కు చెందిన 14వ దలైలమా 1959 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. 1951లో టిబెట్‌ను చైనా ఆక్రమించి, అప్పటి నుంచి పాలన కొనసాగించడం మొదలుపెట్టింది. వారి జాతీయ, సాంస్కృతిక గుర్తింపులను, సాంప్రదాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా.. చైనా ఈ దురాక్రమణకు దిగింది. అయితే.. చైనా ప్రభుత్వాన్ని తిరిగి వెనక్కు పంపించేందుకు టిబెటన్లు తిరుగుబాటు చేశారు. కానీ.. ఇందులో వాళ్లు విజయం సాధించలేదు. అప్పుడు దలైలమా టిబెట్‌ని వదిలి, భారత్‌కి వచ్చేశారు. అలా ఆయన ఇక్కడే సెటిల్ అయిపోయారు.
Kabul Fuel Tanker Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి, 19 మంది దుర్మరణం
అటు.. లడాఖ్‌లోని గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాక.. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా బలగాలు సరిహద్దు దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు వాళ్లని అడ్డుకొని, తిరిగి వెనక్కు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ చోటు చేసుకోవడంతో.. ఇరు వర్గాల వారు గాయాలపాలయ్యారు.
#WATCH | Kangra, Himachal Pradesh: Dalai Lama says, "…There is no point in returning to China. I prefer India. That's the place. Kangra – Pandit Nehru's choice, this place is my permanent residence…" pic.twitter.com/Wr6dGEPIIx
— ANI (@ANI) December 19, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్‌ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!