కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నాక అనేక దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిబందనలు పాటించకపోవడంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ సీషెల్స్. 98 వేల మంది జనాభా కలిగిన ఈ దేశంలో 61.4 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందించారు.…