ప్రస్తుతం మయమ్నార్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంగ్‌సాంగ్‌సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసి పార్టీని అడ్డుకొని మిలటరీ అధికారాన్ని స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. నిత్యం అంధోళనకారులపై సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున మయమ్నార్ కు చెందిన ప్రజలు, అధికారులు ఇండియాకు శరణార్దులుగా వస్తున్నారు. ఇండియాలోని మిజోరాం రాష్ట్రంతో మయమ్నార్ దాదాపుగా 1645 కిమీ మేర సరిహద్దులను కలిగి ఉన్నది. మయమ్నార్ నుంచి శరణార్ధులుగా వచ్చి తలదాచుకున్న వారిలో చిన్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సలై లియన్ లుయై కూడా ఒకరు. మిజోరాంలోని చంపై జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో శరణార్ధిగా ఉంటున్నారు. దాదాపు 20 మంతి మయమ్నార్ ప్రజాప్రతినిధులు భారత్‌లో శరణార్ధులుగా ఆశ్రయం పొందుతున్నారు.