CJI Justice NV Ramana: ఆర్భిట్రేషన్ సెంటర్ తో హైదరాబాద్ కి మరింత ఖ్యాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ హాజరయ్యారు.
Also Read
- US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతోంది. దీనికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలి లో కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు జస్టిస్ ఎన్వీ రమణ. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుంది. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నా అన్నారు.
ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు. ఆర్బిట్రేషన్ సెంటర్ నిర్మాణానికి సహకరించిన సీజేఐ, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావాల్సి ఉంది కానీ స్వల్ప అస్వస్థత వల్ల రాలేకపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రజలకు మంచి సేవలందించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సెంటర్ సింగపూర్ లండన్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు ఉన్నంత పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు లావు నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?