Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు.