శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రీకల్ ట్రైలర్ కు సినిమాపై మంచి అంచనాలు పెంచింది.
Also Read : Bollywood : హీరో నుండి విలన్‌గా మారిన స్టార్ కిడ్
అయితే చిత్ర నిర్మాతలలో ఒకరైన శిరీష్ అనుకోని వివాదంలో వేలు పెట్టారు. ఓ మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా తమకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. హీరో చరణ్, అలాగే దర్శకుడు శంకర్ కనీసం మమల్ని పలకరించలేదు అని కామెంట్స్ చేసాయి. శిరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కబడ్ధార్ అని లేఖలు విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్ కు క్షమాపనులు చెప్తూ లెటర్ రిలీజ్ చేసారు నిర్మాత శిరీష్. అయితే శిరీష్ చేసిన వ్యాఖ్యలు నితిన్ నటిస్తున్న తమ్ముడికి తిప్పలు తెచ్చాయి. నితిన్ నటిస్తున్నతమ్మడు సినిమా కేవలం రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కంటే గేమ్ ఛేంజర్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే దిల్ రాజు, శిరీష్ నిర్మించే తమ్ముడును చూడొద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. అసలే హిట్టు లేక ఇబ్బంది పడుతున్ననితిన్ తమ్మడుపై ఆశలు పెట్టుకుంటే శిరీష్ వాటిని గంగలో కలిపేసాడని ఫీల్ అవుతున్నారు నితిన్ ఫ్యాన్స్.