‘కుబేర’తో మళ్ళీ హిట్ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రస్తుతం సినిమా విజయంలో ఆస్వాదిస్తున్నారు. కోలీవుడ్‌లో కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. దీంతో శేఖర్ తన తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Also Read : NTR : పాపం కొరటాల శివకు తలనొప్పిగా మారిన ‘దేవర 2’!
‘ ‘కుబేర’ లో పాత్రలపై వస్తున్న స్పందన నేను ఊహించలేదు. ప్రేక్షకులు మంచి కథకు న్యాయం చేస్తారని మరోసారి నిరుపించుకున్నారు. ఒక సీరియస్ కంటెంట్ తో వచ్చిన తర్వాత, నా తర్వాత చిత్రం ప్రశాంతమైన ప్రేమకథ తోనే వస్తుంది. అందుకే నా మనసును రివైండ్ చేసి, కాస్త రిలాక్స్ అవుతా. ఎక్కువ టైం తీసుకున్నా, నా నుంచి వచ్చే సినిమా కొత్తదనంతో, స్పెషల్‌గానే ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు 20 ఏళ్ల వయసు వారికి తెలిసే విషయాలు ,ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా 10 ఏళ్ల వారికే తెలిసిపోతున్నాయి. ఈ టైమ్ లో ఈ తరం వారికి తగినట్లు నేను కథ రాయగలగాలి’ అని కూడా తెలిపారు శేఖర్. ఈ ప్రకటనతో శేఖర్ ఫ్యాన్స్‌లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఇక తన కొత్త లవ్ స్టోరీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొడతాడా? అన్నది చూడాలి!