India-China: నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
- నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
- విదేవీ విధానానికి ఐదు సూత్రాలు ఉపయోగకరం
- శాంతి.. అభివృద్ధికి ఐదు సూత్రాలు మేలు చేస్తాయని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నోట శాంతిసందేశం ఆశ్చర్యం కలిగించింది. విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్ – చైనా మధ్య కుదిరిన ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Viral News : ఓరి దేవుడా.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకున్న మహిళ
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి పంచశీల సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిస్తాయని తెలిపారు. చైనా-భారత్, చైనా-మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం కూడా చేర్చిందని గుర్తుచేశారు. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందఅని జిన్‌పింగ్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: TEA: మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే!
పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్ – చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, చౌ-ఎన్‌లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.

తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!