జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంపై చైనా తీవ్రంగా మండిపడింది. చిన్న కూటములతో భయపెట్టాలని చూడటం తగదని, చిన్న చిన్న కూటములతో భయపెట్టే రోజులు పోయాయని, ప్రపంచ దేశాలకు సంబందించిన నిర్ణయాలను అన్ని దేశాలతో సంప్రదించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలని చైనా చెబతున్నది. తమకు అన్ని దేశాలు సమానమే అని చైనా పేర్కొన్నది.