China Says It Is Ready To Fight With Taiwan: చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ‘జాయింట్ స్వోర్డ్’ పేరుతో తైవాన్ చూట్టూ మూడు రోజుల పాటు భారీ స్థాయిలో సైనిక విన్యాసాలను చేపట్టిన చైనా.. తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సోమవారం ప్రకటించింది. ‘‘యుద్ధం ఎప్పుడు మొదలైనా సరే, పోరాడేందుకు మా బలగాలు రెడీగా ఉన్నాయి. స్వాతంత్రం కోసం తైవాన్ ప్రయత్నించినా, ఈ విషయంలో విదేశాలు జోక్యం చేసుకున్నా.. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’’ అంటూ ఒక ప్రకటనలో చైనా సైన్యం వార్నింగ్ ఇచ్చింది.
Shefali Shah: నన్ను అనుచితంగా తాకారు.. నేనేం చేయలేకపోయా
గత వారం తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌వెన్ అమెరికా పర్యటన తర్వాత.. తైవాన్ చుట్టూ చైనా సైన్యం మూడు రోజుల భారీ పోరాట విన్యాసాల్ని పూర్తి చేసింది. ఈ విన్యాసాల్లో చైనా ప్రధానంగా గగనతల పోరాట సామర్థ్యాలపై దృష్టిసారించింది. తొలిసారి జె-15 యుద్ధ విమానాలు అందులో పాల్గొన్నాయి. అవి చైనా విమాన వాహకనౌకల నుంచి ఎగిరి, తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 35 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధిలోని మీడియన్ లైన్‌ను దాటాయి. షాండాంగ్ విమాన వాహకనౌకను కూడా పసిఫిక్ మహాసముద్రంలో చైనా ఉపయోగించింది. ఒకవేళ యుద్ధం జరిగితే.. తైవాన్‌కు సాయం చేసేందుకు విదేశీ సైన్యాలేవీ రాకుండా అడ్డుకునేందుకు షాండాంగ్ సన్నద్ధతను ఆ దేశం పరీక్షించినట్లు సమాచారం.
Kangana Ranaut: ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్
మరోవైపు.. తైవాన్ సమీపంలో 8 యుద్ధ నౌకలతో పాటు 71 విమానాలు డిటెక్ట్ అయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూ-ఆధారిత క్షిపణి వ్యవస్థ, నౌకాదళం ద్వారా.. చైనా కదలికల్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. పెలోసి విజిట్ తర్వాత నుంచి మిలిటరీ యాక్టివిటీ పెరిగిందని, చైనీస్ PLA ఫైటర్ జెట్‌లు క్రమం తప్పకుండా మధ్య సరిహద్దు రేఖపై ఎగురుతున్నాయని చెప్పింది. అయితే.. వివాదాలు తలెత్తకుండా, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకే తాము ఓర్పుతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది.