డ్రాగన్ కంట్రీ చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. సరిహద్దుల్లో కుయుక్తులు పన్నుతోంది. భారత్‌పై పైచేయి సాధించేందుకు టిబెటన్‌లను రంగంలోకి దించుతోంది. మన దగ్గర ఉన్న ఎస్‌ఎఫ్‌ఎఫ్ బలగాల తరహాలోనే టిబెటన్లతో ప్రత్యేక దళాలను సిద్ధం చేస్తోంది. కుయుక్తులు.. దొంగ దెబ్బలు..! చైనాకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య..! లద్దాఖ్‌లో ఉద్రిక్తతల తర్వాత డ్రాగన్.. ఇలాంటి వాటికి మరింత పదునుపెట్టింది డ్రాగన్. ఎల్‌ఏసీ ఉద్రిక్తతల సమయంలో భారత ప్రత్యేక దళాలు.. వ్యూహాత్మకంగా కదిలాయి. ఎస్‌ఎఫ్‌ఎఫ్.. ప్రత్యేక సాయుధ బలగాలు..…